సంగారెడ్డి జిల్లా తూప్రాన్ పట్టణంలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నవదుర్గ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 26వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల అనంతరం ఆదివారం మధ్యాహ్నం ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. శోభ యాత్రలో భవాని దీక్ష మాతలు నృత్యాలు చేస్తూ శోభయాత్ర ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.