‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ మూవీని శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కించాడు. భారత వైమానిక దళంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మార్చి 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్‌ను తెలుగులో రామ్ చరణ్ విడుదల చేయగా.. హిందీలో సల్మాన్ ఖాన్ రిలీజ్ చేశారు.