జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడికి బర్త్డే విషెస్ తెలుపుతూ ప్రత్యేక పోస్ట్ పెట్టారు. ”కళ్యాణ్ బాబు.. ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. దీర్ఘాయుష్మాన్ భవ!” అంటూ మెగాస్టార్ రాసుకొచ్చారు.