హైదరాబాద్‌లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్‌తో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకున్నది. మైక్రోసాఫ్ట్‌తో హైదరాబాద్‌కు ప్రత్యేక అనుబంధం ఉందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. 'హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ AI సెంటర్ ఏర్పాటు చేస్తాం. భవిష్యత్తు అంతా ఏఐదే. గవర్నెన్స్, పబ్లిక్ సేవల్లో ఏఐని ఉపయోగిస్తాం. ఈ కొత్త క్యాంపస్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు మరింత మెరుగవుతాయని ఆశిస్తున్నా' అని రేవంత్ తెలిపారు.