AP: వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా మార్చిన పేదల ఇళ్ల నిర్మాణాన్ని గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేసేందుకు ఆదివాసీ గిరిజనులకు రూ.లక్ష, ఎస్టీలకు రూ.75 వేలు, ఎస్సీలకు రూ.50 వేలు, చేనేతలకు రూ.50 వేల చొప్పున అదనపు సాయాన్ని అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ నిర్ణయంతో దాదాపు 4.05 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. దీని కోసం ప్రభుత్వం రూ.2,402 కోట్లు ఖర్చు చేయనుంది.