AP: రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ విజృంభించడంతో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. అయితే ఈ వ్యాధి మనుషులకు కూడా సోకుతుందనే వదంతులు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులను అలర్ట్ చేసింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి కోళ్లు చనిపోయాయని, రెండు గ్రామాల పరిధిలోనే కోళ్లు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.