AP: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించినట్లు ఆధారాలు ఉంటే చూపాలని అంబటికి సవాల్ విసిరారు. ప్రాజెక్టు ఎత్తుని 41.15 మీటర్లకు కుదించేలా సీఎం చంద్రబాబు కేంద్రంతో రహస్య ఒప్పందం చేసుకుని, ఆ విషయం గోప్యంగా ఉంచినట్టు అంబటి ఆరోపించడం అసలు బాగోలేదని మండిపడ్డారు. పోలవరం, అమరావతి అనేవి సీఎం చంద్రబాబుకు రెండూ కళ్ళలాంటివని పేర్కొన్నారు.