మహారాష్ట్ర మంత్రి సంజయ్ రాథోడ్‌కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఓ టెంపోను వెనక నుంచి ఢీకొట్టింది. ఆయన యవత్మాల్‌కు తిరిగి వస్తుండగా దిగ్రాస్-అర్ని మార్గంలో తెల్లవారుజామున 2:30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంత్రికి మాత్రం ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.