ఇందిరమ్మ ఇళ్లు, ఇతర పథకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ లో సోమవారం దివ్యాంగుల జాబ్ పోర్టల్ ఆవిష్కరించారు. మహిళా సంక్షేమ శాఖలో 10 మందికి నియామక ఉత్తర్వులు అందించి మాట్లడారు. 'దివ్యాంగులు కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. జాబ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుంటే అర్హత ప్రకారం ఉద్యోగాలు వస్తాయి. సంక్షేమ నిధుల్లో ఐదు శాతం దివ్యాంగులకు కేటాయిస్తున్నాం' అని తెలిపారు.