తేనెటీగల దాడిలో తల్లీ, ముగ్గురు కూతుళ్లు మృతి

55చూసినవారు
తేనెటీగల దాడిలో తల్లీ, ముగ్గురు కూతుళ్లు మృతి
జార్ఖండ్ రాజధాని రాంచీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నగరానికి చెందిన ఒక మహిళ, తన ముగ్గురు కూతుళ్లతో స్నానం చేసేందుకు బావి దగ్గరకు వెళ్లింది. వారు బావిలోకి దిగి స్నానం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా తేనెటీగలు వారిపై దాడి చేశాయి. ఈ దాడిలో ఆ నలుగురు అక్కడికక్కడే మరణించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్