మహాలక్ష్మి హత్య కేసుతో సంబంధం ఉన్న అనుమానితుడు బెంగాల్‌లో ఉన్నట్లు గుర్తించినట్లు కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర్ వెల్లడించారు. అతడిని అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినైనా కస్టడీలోకి తీసుకున్నారా? అని విలేకర్లు ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని హోంమంత్రి స్పష్టం చేశారు. కొందరు అనుమానితులను మాత్రం పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు. మహిళల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు.