యూట్యూబ్‌లో మిస్టర్ బీస్ట్‌ రికార్డ్

82చూసినవారు
యూట్యూబ్‌లో మిస్టర్ బీస్ట్‌ రికార్డ్
అమెరికన్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్‌(జిమ్మీ డొనాల్డ్‌సన్) అరుదైన ఘనత సాధించారు. 267M సబ్‌స్క్రైబర్‌లతో ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లున్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. టీ-సిరీస్ 266M సబ్‌స్క్రైబర్‌లతో 2వ స్థానంలో ఉంది. 2012లో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన మిస్టర్ బీస్ట్ వినూత్న వీడియోలు చేస్తూ ఆదరణ పొందారు. అతడి వీడియోలను కోట్లాది మంది వీక్షిస్తుండటంతో యూట్యూబ్​ ద్వారా రూ.వేల కోట్లు సంపాదిస్తున్నారు.