కెనడాలో భారతీయుడి హత్య

57చూసినవారు
కెనడాలో భారతీయుడి హత్య
కెనడాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్‌లోని లుథియానాకు చెందిన యువరాజ్‌ 2019లో కెనడా వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల కెనడాలో శాశ్వత నివాస హోదా లభించింది. ఈ క్రమంలో శుక్రవారం బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో కాల్పులు జరిగాయి. పోలీసులు అక్కడికి చేరుకొని యువరాజ్‌ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనలో నలుగురు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్