భారతీయ రైలులో పుట్టగొడుగులు పెరుగుతున్నట్లు చూపించే ఫోటోలను తాజాగా ఎక్స్‌లో ఒక వినియోగదారుడు షేర్ చేశారు. "సుదూర ప్రయాణం చేసే శాఖాహార ప్రయాణికులు ఇప్పుడు రైలులోనే తీసుకోవచ్చు" అని రాశారు. ఈ ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తూ.. "పొలం తాజాగా ఉన్నట్లు అనిపిస్తుంది", "ఇప్పుడు మనం రైల్వే అందించే మొక్కజొన్న సూప్‌లో కొన్ని తాజా పుట్టగొడుగులను జోడించవచ్చు" అంటూ కామెంట్లు చేస్తున్నారు.