నేడు మటన్, చికెన్ షాపులు బంద్

36159చూసినవారు
నేడు మటన్, చికెన్ షాపులు బంద్
జైన మత ప్రచారకుడు మహావీర్ జయంతి సందర్భంగా ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మాంసం దుకాణాలు బంద్ చేయాలని జీహెచ్ఎంసీ ఆదేశించింది. చికెన్, మటన్ అమ్మకాలను నిషేధించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు నగరంలో తక్కువ సంఖ్యలో ఉన్న జైనుల కోసం ఆదివారం గ్రేటర్ వ్యాప్తంగా షాపులు బంద్ చేయడం ఏంటని మాంసం ప్రియులు ప్రశ్నిస్తున్నారు.