పారాలింపిక్స్‌లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన నవ్‌దీప్ సింగ్ దేశానికి 29వ పతకం అందించాడు. పారిస్ నుంచి స్వదేశం వచ్చిన నవ్‌దీప్ ప్రధాని నరేంద్ర మోడీని కలిశాడు. అనంతరం ఈ జావెలిన్ త్రోయర్ వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయాడు. ఈ సందర్భంగా ఈ పారా అథ్లెట్ తన ఫేవరెట్ క్రికెటర్ ప్రస్తుతం టీమిండియా సారథిగా ఉన్న రోహిత్ శర్మ అని అన్నాడు.