లింగాల: కోడిగుడ్డు గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి
లింగాల మండల కేంద్రంలో చెన్నంపల్లి చౌరస్తా వద్ద వృద్ధుడు ఒక బెట్టిన కోడి గుడ్డు తింటూ ప్రమాదవశాత్తూ గొంతులో ఇరుక్కొని మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. వృద్ధుడు సొంత పనులపై లింగాల మండల కేంద్రానికి ఆదివారం వచ్చి మధ్యాహ్న సమయం కావడంతో కోడిగుడ్డు, మిర్చిలు తీసుకొని తింటుండగా, గుడ్డు గొంతులో ఇరుక్కుని మృతి చెందాడని స్థానికులు తెలిపారు. వృద్ధునికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.