May 15, 2024, 10:05 IST/కల్వకుర్తి
కల్వకుర్తి
జాతీయ రహదారి భూసేకరణ పనులు వేగవంతం చేయాలి:కలెక్టర్
May 15, 2024, 10:05 IST
జాతీయ రహదారి పనులు, భూసేకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం నాగర్ కర్నూల్ కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సంబధిత శాఖలైన రెవెన్యూ, జాతీయ రహదారి అధికారులతో భూసేకరణ పనులు, జాతీయ రహదారి పురోగతి పనులపై సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారి ఆర్ అండ్ బీ ఎస్సీ ధర్మారెడ్డి, కొల్లాపూర్ ఆర్డీవో నాగరాజ్, తదితరులు పాల్గొన్నారు.