తిరుచానూరు పీఎస్ వద్ద ఉద్రిక్తత

69చూసినవారు
తిరుచానూరు పీఎస్ వద్ద ఉద్రిక్తత
బాధితులకు అండగా నిలబడాల్సిన పోలీస్ వ్యవస్థ కంచె చేను మేసిన విధంగా ప్రవర్తిస్తోందని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి దుయ్యబట్టారు. తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఈవీఎం భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పులివర్తి నానిపై జరిగిన దాడికి నిరసనగా సుధారెడ్డి తిరుచానూరు పీఎస్ వద్ద రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలియజేశారు. సుధారెడ్డికి మద్దతుకు టీడీపీ కార్యకర్తలు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్