పాముకు దహన సంస్కారాలు (వీడియో)

1056చూసినవారు
ఏపీలో వింత ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ పంచాయతీ పరిధిలోని మేళంవారిమెరకలో మంగళవారం ఓ పాముకు దహన సంస్కారాలు చేశారు. ఇళ్ల పరిసరాల్లో తాచు పాము చనిపోయి ఉండగా గమనించిన స్థానికులు దాన్ని దేవుడి పాముగా భావించి పూజలు చేశారు. అనంతరం పాడెపై ఊరేగించి దహన సంస్కారాలు పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్