చెట్టుకు ఉరేసుకున్న యువతి
దామరచర్ల మండలం పరిధిలోని పుట్టల గడ్డ శివారులో ఆదివారం యువతి అనుమానాస్పదంగ మృతి చెందింది. మాన్ తండాకు చెందిన మౌనిక (20 సంవత్సరాలు) చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందింది. మృతదేహంపై గాయాలు ఉండడంతో స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలు పరిశీలించారు. దర్యాప్తు ప్రారంభించారు. హత్య లేక ఆత్మహత్య అని తేల్చే పనిలో ఉన్నారు.