ఘనంగా ఐలమ్మ జయంతి వేడుకలు

84చూసినవారు
ఘనంగా ఐలమ్మ జయంతి వేడుకలు
నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో గురువారం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. మహిళాశక్తికి, బహుజన ధీరత్వానికి ప్రతీక ఐలమ్మ అని నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బాలు నాయక్, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, అడ్వకేట్ కృష్ణ జాంబవ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్