నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై కేసులు నమోదు

537చూసినవారు
నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై కేసులు నమోదు
కొండమల్లేపల్లి: నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తప్పవని ఎస్సై రామ్మూర్తి అన్నారు. శనివారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నెంబర్ ప్లేట్ లేని 18 వాహనాలపై కేసులు నమోదు చేశారు. కొంత మంది నంబర్ ప్లేట్ లేకుండా వాహనాల నడుపుతూ అనేక నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే ఎంవీ ఆక్ట్ రూల్స్ ప్రకారం తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేయబడతాయన్నారు.