నటుడు సైఫ్ అలీఖాన్ హెల్త్ రిపోర్ట్ విడుదల
దుండగుడి దాడిలో గాయపడిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ హెల్త్ అప్డేట్ను లీలావతి ఆసుపత్రి వైద్యులు విడుదల వెల్లడించారు. ఆయన్ను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించినట్లు చెప్పారు. చేయి, మెడపై గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు పేర్కొన్నారు. సైఫ్ వెన్ను నుంచి కత్తిని తొలగించినట్లు తెలిపారు. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని.. ప్రస్తుతం సాధారణ ఆహారం తీసుకుంటున్నారని తెలిపారు. సైఫ్ ప్రస్తుతం మాట్లాడుతున్నారని, నడుస్తున్నారని వైద్యులు పేర్కొన్నారు.