అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’ వచ్చే నెల 7న విడుదల కానుంది. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఎక్కువ భాగం చిత్రీకరణ శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. అయితే చిత్రీకరణ సమయంలో నాగచైతన్య అక్కడి స్థానిక ప్రజలతో మాట్లాడారు. వారి స్టైల్‌లోనే చేపల పులుసు పెడతానని చెప్పి, వండి అక్కడివారికి వడ్డించారు.