మహారాష్ట్రలోని నాసిక్-పుణే హైవేపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వేగంతో వచ్చిన ఐచర్ ప్యాసింజర్లతో వెళ్తున్న మాక్సిమోను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో మాక్సిమో ముందున్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో అక్కడికక్కడే 9 మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదంలో మాక్సిమో నుజ్జునుజ్జయింది.