AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రంలోని మిగతా 62 నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రివర్గం చర్చిస్తోంది. ప్రకాశం బ్యారేజీ దిగువన కుడివైపు రిటైనింగ్ వాల్ కోసం రూ.294 కోట్లకు అనుమతి ఇవ్వనుంది. అందరికీ ఇళ్లు పథకం విధివిధానాల జారీకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వీటితో పాటు గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల రిషనలైజేషన్ ప్రక్రియపై మంత్రివర్గం చర్చిస్తోంది.