జనవరి 18న ప్రయాగ్ రాజ్‌లో శ్రీవారి కళ్యాణోత్సవం

64చూసినవారు
జనవరి 18న ప్రయాగ్ రాజ్‌లో శ్రీవారి కళ్యాణోత్సవం
యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో జనవరి 13న మహా కుంభమేళా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కుంభమేళాలో భాగంగా నాగవాసుకి దేవాలయం సమీపంలో యూపీ ప్రభుత్వం శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసింది. 170 మంది సిబ్బందితో నమూనా ఆలయంలో తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో జనవరి 18న ఉదయం 11 నుండి 12 గంటలకు శ్రీవారి నమూనా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై తిరుమలేశ్వరుని స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించనుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్