Top 10 viral news 🔥
హైదరాబాద్లో కన్నడ నటి ఆత్మహత్య
హైదరాబాద్లో విషాద ఘటన చోటుచేసుకుంది. కన్నడ పాపులర్ సీరియల్ నటి శోభితా శివన్న హైదరాబాద్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కర్ణాటకలోని సక్లేశ్పూర్కు చెందిన నటి శోభితా బ్రహ్మగంటుతో సహా పలు సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు సాధించారు. 2023లో వివాహం చేసుకున్నాక తన నటనకు విరామం ఇచ్చారు. అనంతరం భర్తతో కలిసి హైదరాబాద్లో స్థిరపడ్డారు. కాగా, శోభిత ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో కారణాలు తెలియాల్సి ఉంది.