రూ.2 లక్షల రుణమాఫీ 100% పూర్తి అయింది: CM రేవంత్

59చూసినవారు
తెలంగాణలో రైతు రుణమాఫీ రూ.2 లక్షల వరకు 100 శాతం పూర్తి అయినట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. బ్యాంకుల్లో 12-12-2018 నుంచి 09-12-2023 మధ్య కాలంలో రూ. 2 లక్షలు రుణాలు తీసుకున్న వారికి సంపూర్ణ మాఫీ జరిగిందన్నారు. 'ఇప్పటివరకూ 25.35 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణాలు మాఫీ చేశాం. రైతులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీయే. రుణమాఫీ విషయంలో BRS ప్రభుత్వం రైతులను పదేళ్ల పాటు మోసం చేసింది' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్