స్వామివారి పులిహోర ప్రసాదంలో పురుగుల కలకలం (వీడియో)

66చూసినవారు
TG: స్వామివారి పులిహోర ప్రసాదంలో పురుగులు వచ్చిన ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అందించే ప్రసాదాలలో పురుగులు వచ్చాయి. తరచుగా స్వామివారి పులిహోర ప్రసాదంలో పురుగులు, లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు రావడంతో భక్తులు మండిపడుతున్నారు. స్వామివారి ప్రసాదాల నాణ్యత పర్యవేక్షణ లేకపోవడమే దీనికి కారణమని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్