దేవరకొండ పట్టణంలో ఎమ్మెల్యే బాలునాయక్ గురువారం పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఉదయం 10: 30 గంటలకు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.