సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చందంపేట ఎమ్మార్వో కార్యాలయం ముందు వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం 37 రోజుకి చేరుకుంది. చందంపేట మండలంలో నూతనంగా మంజూరైన వివిధ రకాల ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేయడానికి విచ్చేసిన దేవరకొండ ఎమ్మెల్యే రామవత్ రవీంద్ర కుమార్ ను కలిసి వీఆర్ఏలు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే స్పందిస్తూ విఆర్ఏ ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.