గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
నల్గొండ జిల్లా డిండి మండలం చెరుకుపల్లి సమీపంలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ముఖాన్ని చున్నితో కప్పేసి, కాళ్ళు చేతులు కట్టి పడేసి బండరాయితో మోది చంపిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.