నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపల్ కమీషనర్ గా వై. సుదర్శన్ సోమవారం బాధత్యలు స్వీకరించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఇంజనీర్ రాజు, సిబ్బంది పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం నూతన కమిషనర్ మాట్లాడుతూ పురపాలికలో నెలకొన్న సమస్యలు తన దృష్టికి తేవాలన్నారు. తన హయాంలో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని ప్రజలు, పాలకవర్గం సిబ్బంది సహకరించాలని అన్నారు.