Sep 26, 2024, 17:09 IST/
సీఎం రేవంత్ కు మహిళల వార్నింగ్ (వీడియో)
Sep 26, 2024, 17:09 IST
ఉప్పల్ రామంత్పూర్ మూసీ పరీవాహక ప్రాంతంలోని కాలనీ వాసులు తమ ఇళ్ల దగ్గరకు వస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇళ్లన్నీ మహిళల పేర్లపైనే ఉన్నాయని, మహిళలకు న్యాయం చేస్తానని ఇప్పుడు అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు తమవి అక్రమ కట్టడాలని తెలియదా అని ప్రశ్నించారు. తమ జోలికి వస్తే ఊరుకోబోమని, అవసరమైతే ఆత్మహత్యలు చేసుకుంటామని, సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తామని చెప్పారు.