అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత
కట్టంగూరు మండలం చెరువు అన్నారం స్టేజి వద్ద హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. కంటైనర్ లో అక్రమంగా తరలిస్తున్న పశువులను పట్టుకున్నారు. కంటైనర్ వాహనంలో 40 ఆవులు, 20 ఎద్దులు అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం రావడంతో వాహనాన్ని పట్టుకొని కేసు నమోదు చేసి సీజ్ చేసినట్లు ఆదివారం తెలిపారు.