బీసీ గణన చేపట్టాలని పూలే అంబేద్కర్ విగ్రహాలకుకు బీసీటియు వినతి

368చూసినవారు
బీసీ గణన చేపట్టాలని పూలే అంబేద్కర్ విగ్రహాలకుకు బీసీటియు వినతి
త్వరలో కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనలో బీసీ ల జనాభా లెక్కించడం ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని నిరసన తెలియజేస్తూ బుధవారం మిర్యాలగూడలో బీసీ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం అందజేయడం జరిగింది. కార్యక్రమానికి హాజరైన బీసీ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేష్ మాట్లాడుతూ దేశంలో 65 శాతం పైగా ఉన్న బీసీ ల లెక్క నిర్దిష్టంగా తేల్చక పోవడం శోచనీయం అన్నారు. 1931 లో స్వాతంత్రం రాక ముందు బ్రిటిష్ వారు జరిపిన లెక్కలు మాత్రమే ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు. దేశంలో బీసీ ల లెక్క తేలితే విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందని కుట్ర తో లెక్క తేల్చడం లేదని ఆరోపించారు. సామాజిక అంతరాలు తొలగించబడాలంటే అందరికి సమాన హక్కులు అందించ బడాలని అన్నారు. జనవరి 7 న ప్రభుత్వం విడుదల చేసిన 31 అంశాల జనాభా గణన ఫార్మాట్ లో బీసీ కాలం రూపొందించి గణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీ జనగణన చేపట్టాక పోతే దేశ వ్యాప్తంగా బీసీ ఉద్యోగ ఉపాధ్యాయులను ఏకం చేసి ఉద్యమాలను ఉదృతం చేస్తామన్నారు. బీసీ టీచర్స్ యూనియన్ మిర్యాలగూడ డివిజన్ శాఖ ఇంచార్జ్ నల్లమేకల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీసీటియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కొప్పోజు శ్రీనివాస్ చారి, నాయకులు గుడిపాటి కోటయ్య ,దామరచర్ల మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డొంక డోకుల వెంకటేశ్వర్లు,శ్రీనివాస్, కార్టూనిస్ట్ వడ్డేపల్లి వెంకటేశ్వర్లు, రెబ్బ రాంబాబు, రెబ్బ శ్రీనువాస్, రచ్చ వెంకటేశ్వర్లు, సర్నాల వెంకన్న యాదవ్, పసుల కాశీయాదవ్ , గోశిక దయాకర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్