ఆర్టీసీ సమ్మెకు బీసీటీయూ మద్దతు

84చూసినవారు
ఆర్టీసీ సమ్మెకు బీసీటీయూ మద్దతు
నల్గొండ జిల్లా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని బీసీ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేష్ అన్నారు. సోమవారం మిర్యాలగూడలో తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని గత మూడు రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులకు బీసీటీయూ పక్షాన సంపూర్ణ మద్దతు పలికారు. న్యాయబద్ధంగా సమ్మె చేస్తున్న 50 వేల మంది ఉద్యోగులను ప్రభుత్వం తొలగిస్తా అని ప్రకటించడం అప్రజాస్వామికమని అన్నారు. ఉద్యోగుల ఉద్యమాలను ప్రభుత్వం అణచి వేయాలని చూడటం శోచనీయం అన్నారు. ఉద్యమాల అణచి వేతే ప్రభుత్వ విధానమైతే తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమించాల్సి వస్తుందని అన్నారు. అరెస్ట్ చేసిన ఆర్టీసీ జెఏసి నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ టీచర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగవెళ్లి ఉపేందర్, ఆర్టీసీ నాయకులు పాండు రంగ, వెంకన్న, వెంకయ్య, గుడిపాటికోటయ్య, జానపా శ్రీనివాస్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్