ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనార్టీ ఈ బి సి జీ రిజర్వేషన్ల అవగాహన పుస్తకాన్ని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు క్యాంపు కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోడే పాక కుమారస్వామి రచించిన జీవోల సమాచార పుస్తకం ఆయా వర్గాలకి ఎంతో ఉపయుక్తమని అన్నారు. విద్యా ఉద్యోగ రంగాల్లో అనుసరిస్తున్న రిజర్వేషన్లు గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. రాజ్యాంగంలో బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రిజర్వేషన్లు బడుగు బలహీనవర్గాల జీవితాల్లో వెలుగులు నింపాలని అన్నారు. పూలే అంబేద్కర్ స్ఫూర్తి తో తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమానికి పెద్ద పీట వేశారని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ వర్గాల కొరకు వెయ్యికి పైగా గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నాగార్జున చారి రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్ మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి రవి, మైనార్టీ విభాగం నాయకుడు మొహమ్మద్ ఖాదర్, మగ్దూం, బిసి టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాపోలు పరమేష్, టీఎన్జీవో అధ్యక్షులు గంగపుత్ర సైదులు, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు, కోలా సైదులు ముదిరాజ్ , కార్టూనిస్టు వడ్డేపల్లి వెంకటేశ్వర్లు విద్యుత్ బిసి జిల్లా నాయకులు పాండురంగ కార్మిక విభాగం నాయకులు నల్ల గంతుల నాగభూషణం, మండల నాయకులు దుర్గం పూడి నారాయణ రెడ్డి, తెలంగాణ జెఎసి నాయకులు, ధర్మ పాల్ రెడ్డి, ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.