అనధికారికంగా గ్రామాలలో బెల్టు షాపులు నడిపితే చర్యలు తప్పవని నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ అన్నారు. బుధవారం మర్రిగూడ మండలంలోని పలు గ్రామాలలో బెల్టు షాపుల ద్వారా మధ్యం అమ్ముతున్న 27 మందికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. గ్రామాలలో 24 గంటలు మధ్యాన్ని విక్రయించడం వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బ తింటున్నాయని, గతంలో కొందరు పై కేసులు నమోదు చేసిన ఎలాంటి మార్పు రాలేదని బెల్ట్ షాపులు నడిపితే కఠిన చర్యలు తప్పమన్నారు.