మునుగోడు మండల ఎలగలగూడెం గ్రామంలో దాదాపు 600 వందల మంది ఓటర్లు ఉన్నారు. బీటీ రోడ్డు సౌకర్యం లేక గ్రామానికి వెళ్ళాలి అంటే ఇబ్బందికరంగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. ఒక పక్క లోతైన కాలువ, మరో పక్క శెలకలు ఎదురుగా వాహనం వస్తే దాటే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బందికి గురవుతున్నామన్నారు. అధికారులు స్పందిచి రోడ్లు వేయాలని కోరారు.