బంద్ విజయవంతం చేయాలి:బీసీ సంక్షేమ సంఘం

67చూసినవారు
బంద్ విజయవంతం చేయాలి:బీసీ సంక్షేమ సంఘం
ఆర్టీసీ కార్మికులు పెట్టిన తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ జయప్రదం చేయాల్సిందిగా బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు చక్ర హరి రామ రాజు ప్రజలకు పిలుపునిచ్చారు. గత రెండు వారాలుగా ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన కోర్కెలను తీర్చాలని ప్రభుత్వంతో అనేక దఫాలుగా విజ్ఞప్తులు చేసినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టడం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మెకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల మంది కార్మికులు సమ్మె చేస్తూ జీతభత్యాలు లేక వీధిన పడి అల్లాడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు గా వ్యవహరించటం తగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల నాయకులను చర్చలకు పిలిచి వారి డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేనియెడల రాష్ట్ర వ్యాప్త సమ్మె వల్ల ఆర్ టి సి కే కాకుండా ప్రభుత్వానికి అనేక వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని రవాణా సౌకర్యం లేక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని వారు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన పోరాటాన్ని వారి డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించారు. నేడు బందుకు నల్లగొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అలాగే అన్ని కుల సంఘాలు మద్దతునిచ్చి ఆర్టీసీ కార్మికుల వెంట ఉంటామని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ, సీనియర్ ఉపాధ్యక్షులు కాసోజు విశ్వనాధ్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్