ప్రజలకు అవసరమైన వాటిని అందించే విధంగా ప్రభుత్వ పాలన ఉండేదే ప్రజా పాలన అని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు రాజరిక పాలన నుండి భారత యూనియన్ లో కలిసిందని, అప్పటినుండి ఈ ప్రాంతంలో రాజరికపాలన పోయి ప్రజాపాలన ప్రారంభమైందని తెలిపారు.