విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన భోజనాన్ని పెట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఆదివారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల వంటగదిని, డైనింగ్ హాల్, పరిసరాలను , ఆటస్థలాన్ని, తరగతి గదులను తనిఖీ చేయడమే కాకుండా విద్యార్థినిలు, వంట వారితో మాట్లాడారు.