ప్రభుత్వం సివిల్ సప్లయిస్ హమాలీలను కార్మికులుగా గుర్తించకుండా శ్రమదోపిడికి పాల్పడుతున్నారని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి, సివిల్ సప్లయిస్ హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పల్లా దేవేందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలుపుకో న్నందుకు నిరసనగా బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సివిల్ సప్లై కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో హమాలి కార్మికులు సమ్మె చేపట్టడం జరిగింది.