కొండ లక్ష్మణ్ జీవితం ఆదర్శం

62చూసినవారు
కొండ లక్ష్మణ్ జీవితం ఆదర్శం
స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ ఉద్యమ కారుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జీవితం ఆదర్శం అని బీసీ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేష్ అన్నారు.శనివారం హాలియలో కొండ లక్ష్మణ్ బాపూజీ 7వ వర్ధంతి ని పురస్కరించుకుని బీసీ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితమే ఉద్యమంగా బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కొరకే పనిచేయడం జరిగిందన్నారు.1969 తెలంగాణ ఉద్యమ సమయంలో తన మంత్రి పదవిని సైతం తృణ ప్రాయంగా వదులుకున్న త్యాగ శీలి కొండ లక్ష్మణ్ అని కొనియాడారు.జీవిత చరమాంకం వరకు లక్ష్య సాధన కొరకు కృషి చేయడం జరిగిందని అన్నారు.ఆయన ఆశయాల సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం డైరెక్టర్ గడ్డం రమణయ్య, బీసీటియు తిరుమల గిరి,అనుముల,పెద్దవూర, మండలాల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు శివప్రసాద్,విజయ్ చందర్,శ్రీనివాస్,నరేష్ కుమార్,దుర్గ ప్రసాద్,బీసీటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంగరి సత్యనారాయణ,యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి సైదులు తదితరులు పాల్గొన్నారు.

కీచక తండ్రి అరెస్ట్... http://bit.ly/2m5RDHN

నెలకి 78,800 జీతంతో DGCA లో ఉద్యోగాలు.. https://bit.ly/2kqiBcL

ట్యాగ్స్ :