నేరేడుగోమ్ములో సమస్యలపై కలెక్టర్ కి వినతి
నల్గొండ జిల్లా నేరేడుగోమ్ము మండల పరిధిలోని బుగ్గ తండా గ్రామ పంచాయతీ ప్రజలు నీటి సమస్య, పారిశుద్ధ్య సమస్య ఎదుర్కొంటున్నట్లు బుధవారం కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. స్పెషల్ ఆఫీసర్ నిర్లక్ష్యం పై ఆయా గ్రామ పంచాయతీల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.