Oct 23, 2024, 07:10 IST/
కాంగ్రెస్ లో చేరిన BRS ఎమ్మెల్యేలపై వేటు వేయాలి: MLC జీవన్ రెడ్డి
Oct 23, 2024, 07:10 IST
తన అనుచరుడు గంగారెడ్డి హత్య నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి పార్టీ అధిష్ఠానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని డిమాండ్ చేశారు. పార్టీ విధానాలకు ఫిరాయింపులు వ్యతిరేకమని, ఎవరైనా ఫిరాయిస్తే సస్పెండ్ చేయాలనే చట్టం ఉందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ కు సంపూర్ణ మెజార్టీ ఉందని, ఎంఐఎంను మినహాయించినా సుస్థిరంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం జీవన్ రెడ్డి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.