హైదరాబాద్‌లోని గోషామహల్‌లో నాలా రోడ్డు భారీగా కుంగింది. దారుస్సలామ్ నుంచి చాక్నావాడికి వెళ్లే రోడ్డు మార్గంలో ఫ్లైవుడ్ దుకాణాల ముందు శివరేజ్ పెద్ద నాలా కుంగింది. బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో రాకపోకలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గతంలోనూ ఇక్కడికి 200 కిలోమీటర్ల దూరంలో ఇదే నాలా కుంగింది.